సెయింట్ పీటర్స్‌బర్గ్: ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్ ఫలితాలపై అంచనా వేస్తున్న చెవిటి పిల్లి అచిల్లీస్ జోస్యం నిజమైంది. టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో రష్యా గెలుస్తుందని అంచనా వేసిన అచిల్లీస్.. శుక్రవారం రాత్రి మొరాకోపై ఇరాన్ జట్టు గెలుస్తుందని అంచనా వేసింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ 90 నిమిషాల్లో ఒక గోల్ కూడా నమోదు కాకపోవడంతో.. అదనంగా మరో ఆరు నిమిషాలు కేటాయించారు. అయినప్పటికీ.. తొలి నాలుగు నిమిషాల్లో గోల్ నమోదవలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. 95వ నిమిషంలో మొరాకో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్‌ని గెలిపించింది. ఈ మ్యాచ్‌కి ముందు ఇరాన్, మొరాకో జెండాల పక్కన బౌల్స్‌తో ఆహారాన్ని ఉంచగా.. అచిల్లీస్ ఇరాన్ జెండా పక్కన ఉన్న ఆహారాన్ని ఆరగించింది.
మ్యాచ్ 95వ నిమిషంలో ఇషాన్ హాజి కొట్టిన ఫ్రీకిక్‌ను.. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు అజీజ్ తలతో బంతిని గోల్‌పోస్ట్ అవతలకి నెట్టబోయాడు. కానీ.. బంతి అనూహ్యంగా మొరాకో గోల్‌పోస్ట్‌లోకే వెళ్లిపోయింది. దీంతో.. ఇరాన్ ఆటగాళ్లు సంబరాలతో మైదానాన్ని హోరెత్తించారు. గత 20 ఏళ్లలో ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలవడం ఇరాన్‌కి ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment