రాబత్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా మొరాకో దేశంలోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో 32 మంది మరణించారని ఆ దేశ హోంశాఖ మంత్రి మంగళవారం మొరాకో రాజధాని రాబత్ లో వెల్లడించారు. వారిలో ఆరుగురు ఆచూకీ తెలియలేదన్నారు. వీరంతా దేశానికి దక్షిణ ప్రాంతంలోని అల్జీరియా సరిహద్దుల్లోని గ్లుమిమ్ నగరవాసులను తెలిపారు. నదులు, కాలువ పరివాహక ప్రాంతాల్లోని 214 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
వర్షాలు, వరదల తాకిడికి దేశంలోని చాలా నగరాల మధ్య రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర అటంకం కలుగుతుందన్నారు. రవాణా వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిన్న ఉదయం వరదల్లో చిక్కుకున్న 14 మంది భద్రత సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి వెల్లడించారు.