
గౌతమీపుత్ర శాతకర్ణి... ఆడియో తిరుపతిలో
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
- మీడియాకు చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి వెల్లడి
తిరుపతి సెంట్రల్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుకలకు తిరుపతి వేదిక కానుంది. ఈ నెల 16న భారీగా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన స్థల పరిశీలన నిమిత్తం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, బాలకృష్ణ వ్యక్తిగత పీఆర్వో సురేంద్ర నాయుడు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. వీరు ఎస్వీ యూనివర్శిటీ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామై దానాలను పరిశీలించారు. అనంతరం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వేడుకలకు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాల కృష్ణతో చర్చించాక 2 రోజుల్లో వేదికను అధికారికంగా ప్రకటి స్తామని తెలిపారు. ఈ నెల 16న తేదిన నిర్వహించే ఈ ఆడియో వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అతిథులుగా హాజరు కానున్నట్టు వెల్లడించారు.