మరో వారంలో ఎంట్రీ! | Shiva Rajkumar plays an extended cameo in Gautamiputra Satakarni | Sakshi
Sakshi News home page

మరో వారంలో ఎంట్రీ!

Published Tue, Nov 1 2016 11:22 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మరో వారంలో ఎంట్రీ! - Sakshi

మరో వారంలో ఎంట్రీ!

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కన్నడ రాజ్‌కుమార్ తన యుడు, ప్రముఖ హీరో శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారనే వార్తను నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయి బాబా అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, ఏ పాత్రలో అనేది వెల్లడించలేదు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నడ మినహా ఇతర భాషల్లో నటించలేదు.

మా చిత్రంలో నటించడానికి అంగీకరించిన శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్. వచ్చే వారం నుంచి ఆయన నటించే సీన్స్ చిత్రీకరించనున్నాం. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement