గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో పిటిషన్‌ | petiton filed against Tax Exemption to Gauthami Putra Satakarni in Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో పిటిషన్‌

Published Wed, Jan 11 2017 11:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో పిటిషన్‌ - Sakshi

గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ : గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీ ప్రభుత్వం  వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా  ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారంటూ ఓ న్యాయవాది పిటిషన్‌ వేశారు. బాలకృష్ణ బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వెలుసుబాటు కల్పించారని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్‌ బెంచ్‌కు వెళ్లాలని పిటిషన్‌కు న్యాయస్థానం సూచించింది.

కాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement