శాతకర్ణి ‘మినహాయింపు’ రికార్డులివ్వండి
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోద పన్ను మినహా యింపునకు సంబంధించిన రికార్డులను తమ ముందుం చాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఏపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. అదే విధంగా వినోద పన్ను మినహాయింపు పొందినప్పుడు, సినిమా టికెట్‌ను దాని ధరలో 75 శాతానికి మించి అమ్మకూడదన్న నిబంధన అమలుకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలను కూడా అందజేయాలని ప్రభుత్వాన్ని, చిత్ర నిర్మాతలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.