
‘తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా’
సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలకృష్ణలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు...చిరు, బాలయ్యను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. చిరంజీవి 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అని అన్నారు.
ఇక గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు.. తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు...సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..... సాహో శాతకర్ణి.. జయహో శాతకర్ణి అంటూ ట్విట్ చేశారు.