Anushka Shetty Get Marriage Proposal From Tollywood Star Director, Know Who Is He - Sakshi
Sakshi News home page

Marriage Proposal To Anushka Shetty: అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్‌ డైరెక్టర్‌..?

Published Wed, Jul 12 2023 3:45 PM | Last Updated on Wed, Jul 12 2023 4:01 PM

Anushka Shetty Get Marriage Proposal From Tollywood Star Director - Sakshi

అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్‌ అయిన ఈమె 2005లో సూపర్‌ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్‌ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు.

అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో  కొన్ని సినిమాలు  ఆమె చేయలేకపోయింది. చాలా గ్యాప్‌ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు  అనుష్క- నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. 

(చదవండి: ‘బలగం' హీరోయిన్‌కి అవమానం!)

ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో అనుష్కని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావించారట స్టార్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారా? అని డైరెక్ట్‌గా అనుష్కనే అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్‌ని సున్నితంగా తిరస్కరించారట.   

(చదవండి: అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్‌ దేవరకొండ)

ఇదీ గతంలో జరిగిన విషయం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌ అవుతుంది. గతంలో తన కుమారుడు ప్రకాష్‌కు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పడు రాఘవేంద్రరావు ఫస్ట్‌ చాయిస్‌ అనుష్కనే అనుకున్నారట. ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా అనుష్కను అడిగితే... తను సున్నితంగా తిరష్కరించిందట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనట్లు అనుష్క చెప్పిందట. దీంతో 2014లో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్‌కు పెళ్లి రాఘవేంద్రరావు జరిపించారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత 2017లో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు పెళ్లి మ్యాటర్‌ గురించి చర్చించాలని భావించాడట. కానీ అప్పటికే పెళ్లికి నో చెప్పిన అనుష్క..  మళ్లీ తన అబ్బాయిని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement