Khaidi No150
-
ఖైదీ, శాతకర్ణి రికార్డు కలెక్షన్లు!
ముంబై: సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమాలు అమెరికా బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మిగతా భాషల సినిమాలను వెనక్కు నెట్టి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి. చిరంజీవి 150 సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలకు ప్రవాస ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ సినిమాలు, ఇటీవల విడుదలైన అన్ని సినిమాలను వెనక్కునెట్టి తెలుగు సినిమాలు అమెరికా మార్కెట్ లో దూసుకుపోతున్నాయని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మొదటి మూడు రోజుల్లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రూ. 11.33 కోట్ల వసూళ్లు రాబట్టి 2 మిలియన్ డాలర్ల మార్క్ కు చేరువయిందని తెలిపారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ. 4.67 కోట్లు రాబట్టిందని చెప్పారు. శర్వానంద్ సినిమా ‘శతమానంభవతి’ రిలీజ్ రోజున రూ. 84.29 లక్షల కలెక్షన్లు తెచ్చుకుని తెలిపారు. శనివారం, ఆదివారం కలెక్షన్లను కలుపుకుంటే అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. -
‘తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా’
సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలకృష్ణలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు...చిరు, బాలయ్యను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. చిరంజీవి 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అని అన్నారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు.. తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు...సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..... సాహో శాతకర్ణి.. జయహో శాతకర్ణి అంటూ ట్విట్ చేశారు. -
చిరు-బాలయ్య సినిమాలకు హై అలర్ట్
-
‘అగ్ర’ సినిమాలకు హై అలర్ట్
సినిమాల రిలీజ్‌లపై డీజీపీ స్థాయిలో పోలీస్‌శాఖ అప్రమత్తం అభిమానులపై డేగకన్ను నేడు చిరు ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ రేపు బాలయ్య ‘శాతకర్ణి’ విడుదల భారీ అంచనాలు, జోరుగా బెట్టింగ్‌లు సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఖైదీ నంబర్ 150 సినిమా బుధవారం విడుదల కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కోడి పందేలపై నెలకొన్న ఉత్కంఠత కంటే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవి నటించిన సినిమాపై ఆయన అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన అభిమానుల్లోనూ అదే స్థాయిలో ఆసక్తి కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ను జనవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. పోలీసుల హై అలర్ట్... చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కేవలం సినిమా హీరోలే కాకుండా రాజకీయాలతో ముడిపడిన వారు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ సినిమాల రిలీజ్ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా రాజకీయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సినిమాల రిలీజ్ నేపథ్యంలో తొలిసారిగా డీజీపీ స్థాయి అధికారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్పీలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన డీజీపీ నండూరి సాంబశివరావు థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. హద్దుమీరొద్దంటూ అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. భారీగా బెట్టింగ్‌లు.. సంక్రాంతికి కోడి పందేల కంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైనే ప్రధానంగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. ఖైదీ నంబర్ 150 సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ సినిమా కూడా వంద కోట్లు వసూలుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీంతో తొలి షో బ్లాక్ టిక్కెట్ రేటు ఎంతకు అమ్ముడుపోతుంది. ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు ప్రదర్శిస్తారు. వారం రోజుల్లో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుంది. ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు ఊపందుకోవడం గమనార్హం.