పురాణాల్లో ధర్మరాజు...చరిత్రలో శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయాలపై రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ - ‘‘అఖండ భారతావనిని ఏకతాటిపైకి తీసుకు రావడానికి పురాణాల్లో ధర్మరాజు, చరిత్రలో శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు.
ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన పేరును గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజున కొత్త యుగానికి ఆది ఉగాది అని, అప్పట్నుంచీ ఉగాది పండుగను నిర్వహిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమవడం దైవ సంకల్పం. బాలకృష్ణ తనయుడు మోక్షజ ్ఞపుట్టినరోజు కూడా అదే రోజే (సెప్టెంబర్ 6) కావడం సంతోషం’’ అన్నారు. ఈ నెల 20 వరకూ మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు.