అభిమానుల ఆశీస్సులే బలం | The strength of the blessings of fans | Sakshi
Sakshi News home page

అభిమానుల ఆశీస్సులే బలం

Published Mon, Jan 9 2017 1:42 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

అభిమానుల ఆశీస్సులే బలం - Sakshi

అభిమానుల ఆశీస్సులే బలం

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  
జ్యోతి థియేటర్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పతాకావిష్కరణ


పాతపోస్టాఫీసు: ‘అభిమానుల ఆశీస్సులే నా బలం.. మీరు ఇచ్చే తీర్పు నా తండ్రి ఇచ్చే తీర్పుగా భావిస్తా’ అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. నగరానికి వచ్చిన ఆయన జ్యోతిథియేటర్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సినిమా విడుదల సందర్భంగా పతాకావిష్కరణ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చామన్నారు. ఇలా సినిమా విడుదలయ్యే లోపు వంద థియేటర్లలో పతాకాలను ఆవిష్కరించనున్నామని చెప్పారు. ప్రపం చ పటంలో భారతావనికి ఎనలేని కీర్తీని, గుర్తింపును తీసుకువచ్చిన శాతకర్ణి తెలుగువాడు కావడం మనం దరి అదృష్టమన్నారు. తండ్రి ఎన్టీఆర్‌లా వైవిధ్యమైన పాత్రలు వేసే అదృష్టం తనకు దక్కిందన్నారు.

ఒక యోధుని యధార్థ గాథే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పారు. సినిమాను పూర్తి చేయడానికి 79 రోజులు పట్టిందని, అందరి సమష్టి కృషితోనే ఇంత గొప్పగా రూపొందిందిన్నారు. చిత్రంలో తల్లిపాత్రకు హేమమాలిని ఒప్పుకోకపోతే ఈ సినిమాకు న్యాయం జరిగేది కాదన్నారు. మంచి చేసేవాడికి పంచభూతాలు సహకరిస్తాయని, ప్రజలకు మేలు చేయడం పాలకుని బాధ్య తని గుర్తుచేశారు. మన గొప్పలు మనం చెప్పుకోవడం తప్పని ఇతరులు మనలను గొప్పగా చెప్పుకోవాలన్నారు. కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement