
ఏకచ్ఛత్రాధిపతి
ఇప్పటివరకూ వెండితెరపై ఎవరూ చూపని చారిత్రక గాథ.. అఖండ భారతాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహా చక్రవర్తి కథ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందవ చిత్రమిది. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. ఇందులో ఏకచ్ఛత్రాధిపతి శాతకర్ణిగా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే.
శనివారం సింహాసనంపై రాజసం ఉట్టిపడేలా కుర్చున్న శాతకర్ణి రాయల్ లుక్ విడుదల చేశారు. విజయదశమి కానుకగా మంగళవారం ఉదయం టీజర్ విడుదల చేయనున్నారు. శాతకర్ణి భార్యగా శ్రీయ, తల్లిగా హేమమాలిని నటిస్తున్నారు. డిసెంబర్‌లో పాటల్ని, సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.