
'నా సినిమాలే నాకు పోటీ'
తన సినిమాలే తనకు పోటీ అని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు.
అమరావతి: తన సినిమాలే తనకు పోటీ అని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో శుక్రవారం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... అభిమానులు తనపై ఎన్నో ఆశలు పెట్టున్నారని అన్నారు.
గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని తన తండ్రి ఎన్టీఆర్ తెరకెక్కించాలని భావించారని అయితే అది సాధ్యపడలేదన్నారు. ఈ సినిమా చేయడం దైవ నిర్ణయం అని, తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని బాలకృష్ణ పేర్కొన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి నవరసాలు ఉండే చిత్రం అవుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.