ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ లు దర్శించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాలకృష్ణ బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.