ఆనందంలో శాతకర్ణి తల్లి | Hema Malini to play Balakrishna's mother in Krish film | Sakshi
Sakshi News home page

ఆనందంలో శాతకర్ణి తల్లి

Published Tue, Aug 30 2016 12:40 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఆనందంలో శాతకర్ణి తల్లి - Sakshi

ఆనందంలో శాతకర్ణి తల్లి

 ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణ విజయం’లో నటించిన అలనాటి డ్రీమ్ గాళ్ హేమమాలిని దాదాపు నలభై ఐదేళ్ల తర్వాత తెలుగు తెరపై మళ్లీ కనిపించనున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. టైటిల్ రోల్ చేస్తున్న బాలకృష్ణకు ఆమె తల్లిగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతోంది. సోమవారం హేమమాలిని పాత్ర చిత్రీకరణ మొదలైంది.
 
 యుద్ధంలో ఓటమి ఎరుగని వీరుడు.. తన విజయంలో తల్లి పాత్రను సగర్వంగా చాటిన ధీరుడు.. ఒకటవ శతాబ్దంలో అఖండ భారతావనిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు శాతకర్ణి. అంతటి మహావీరుడి తల్లి పాత్ర చేయడం ఎగ్జైటింగ్‌గా ఉందని హేమమాలిని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో తల్లీకొడుకుల మధ్య సీన్స్ తీస్తున్నారు. 18 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రానికి మాటలు: బుర్రా నరసింహ, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement