
శరణమా.. రణమా?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్ ను విజయదశమి కానుకగా మంగళవారం విడుదల చేశారు. అఖండ భారతాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహా చక్రవర్తి కథతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ అభిమానులకు అలరించేలా ఉంది.
'విరామం లేదు విశ్రాంతి లేదు. నా కత్తికంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది.. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా?' అంటూ ఏకచ్ఛత్రాధిపతిగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శాతకర్ణి భార్యగా శ్రీయ, తల్లిగా హేమమాలిని నటిస్తున్నారు. డిసెంబర్ లో పాటలు విడుదల చేస్తారు.