మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు.
‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్ కోరారు.