entertainment tax
-
వినోద పన్ను మినహాయింపు లబ్ధి ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: కొన్ని సినిమాలకు ప్రభుత్వం ఇచ్చే వినోద పన్ను మినహాయింపు లబ్ధిని సినీ ప్రేక్షకులు కాకుండా ఆ చిత్రాల నిర్మాతలు పొందుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల కోసం ఇచ్చే పన్ను మినహాయింపులను నిర్మాతలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. వినోద పన్ను లబ్ధి ప్రేక్షకులకు చెందాలా? లేక సదరు సినిమా నిర్మాతకు చెందాలా? అన్న విషయంపై స్పష్టతనివ్వాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపన్ను మినహాయింపునివ్వడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఆదర్శ్‌కుమార్ 2017లో దాఖలు చేసిన పిల్ బుధవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వినోదపన్ను మినహాయింపును సినీ ప్రేక్షకులకు ఇస్తారని, దీంతో టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. -
కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను
సాక్షి, టీ.నగర్: కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను విధించాలని అసెంబ్లీలో గురువారం మంత్రి ఎస్పీ వేలుమణి ఓ చట్ట సవరణ ముసాయిదాను దాఖలు చేశారు. అందులో తమిళనాడు చలనచిత్ర ప్రతినిధులు, స్థానిక సంస్థలకు వినోదపు పన్ను విధించడంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఈ వ్యవహారంపై నియమించిన ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. పరిశీలించిన ప్రభుత్వం వినోదపు పన్ను వసూలు చేసేందుకు స్థానిక సంస్థల ద్వారా నియమితులైన అధికారులు పరిశీలన జరిపేలా అనుమతిచ్చే చట్ట ముసాయిదా దాఖలు చేశామన్నారు. ఈ మేరకు కార్పొరేషన్, పట్టణ పంచాయతీ పరిధి లోని థియేటర్లలో 30 శాతం వినోదపు పన్ను చెల్లించాలని, పాత చిత్రాలకు 20 శాతం వినోదపు పన్ను చెల్లించాలని అందులో పేర్కొన్నారు. -
వినోద పన్ను రద్దు?
సాక్షి, చెన్నై: సినిమా థియేటర్లకు విధిస్తున్న వినోదపు పన్ను రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గ ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు ప్రభుత్వం ఆదేశాలమేరకు కార్పొరేషన్, నగర, పురపాలక సంస్థలు, పట్టణ, తదితర పంచాయతీల ద్వారా వినోద పన్ను వసూళ్లు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వినోద పన్ను ముప్ఫై శాతం మేరకు అమల్లో ఉంది. అయితే, జూలైలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి రావడంతో థియేటర్ల యాజమాన్యంలో ఆందోళన బయలుదేరింది. అన్ని రకాల పన్నులు ఒకే గొడుగు నీడలోకి వచ్చినా, వినోద పన్ను అనేది రాష్ట్రంతో ముడిపడి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. జీఎస్టీ రూపంలో రూ.100కు పైగా ఉన్న టికెట్టుకు 28 శాతం, వంద వరకు ఉన్న టికెట్లకు 18 శాతం పన్ను అమల్లోకి వచ్చింది.ఈ పన్ను అమలుతో రూ.120గా ఉన్న టికెట్లు రూ.150గాను , రూ.100 ఉన్న టికెట్లు రూ.120గాను, రూ.80గా ఉన్న టికెట్లు రూ.100కు పెరిగాయని చెప్పవచ్చు. జీఎస్టీతో పాటుగా వినోద పన్ను సైతం చెల్లించాల్సి రావడంతో థియేటర్ల సంఘాలు ఏకమైన పోరుబాటను సైతం సాగించాయి. ఒక టికెట్టుకు తాము 58 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా, టికెట్ల ధరల్ని మరింతగా పెంచాల్సి ఉందని, ఇది ప్రజల మీద భారం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ ఆందోళనలతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అధికారులు, పలువురు మంత్రులతో కూడిన ఈ కమిటీ వినోద పన్ను విషయంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కమిటీ తన పరిశీలనను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఉంది. అందులోని వివరాల మేరకు వినోద పన్ను రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వినోద పన్ను రద్దు చేసిన పక్షంలో నగర, పురపాలక, పట్టణ తదితర పంచాయతీల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందన్న వాదనను అధికార వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాయి.అయితే, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని రాబట్టుకునే రీతిలో మరికొన్ని సూచనలు ఇచ్చి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వినోద పన్ను రద్దుచేసినా, ఆదాయానికి గండి పడకుండా, త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
ఇక స్టార్ హీరోల చిత్రాలు కాస్టిలీ గురూ!
పెరంబూరు: సినిమా ప్రేక్షకుడిపై టికెట్ల ధరల మోతే. ఇకపై సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారు నటించిన చిత్రాలు చూడాలంటే సాధారణ ప్రేక్షకుడికి అసాధ్యం కానుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అమలు పరచిన జీఎస్టీ పన్నుతో సినిమా టికెట్లపై 18 నుంచి 28 శాతం వరకూ భారం పడుతోంది. అంటే రూ. 120 టికెట్ రూ. 153కూ రూ. 100 టికెట్ రూ. 118కూ పెరిగిపోయింది.దీనికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా వినోదపు పన్నును 30 శాతం విధించడానికి సిద్ధం కావడంతో ఈ పన్నును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్ల యాజమాన్యం సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం చర్చలకు పిలుపు నివ్వడంతో థియేటర్ల మాజమాన్యం సమ్మెను విరమించకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక బృందం, సినీ పరిశ్రమ తరఫున ఒక బృందం ఏర్పాటు చేసి వినోదపు పన్ను విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఇదిమిద్ధంగా ఒక కొలిక్కి రాకపోయినా ప్రస్తుతం కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో సినిమా థియేటర్ల టికెట్ల విషమంలో ఒక కొత్త విధానం అమలులో ఉంది. అక్కడ స్టార్ హీరోల చిత్రాలకు వార చివరి రోజుల్లో అధిక ధరను వసూలు చేస్తున్నారు. ఇతర రోజుల్లో సాధారణ ధరలను వసూలు చేస్తున్నారు.అదే విధానాన్ని తమిళనాడులో అమలు పరచే విషయంలో రాష్ట్రప్రభుత్వానికి,చిత్ర పరిశ్రమకు చెందిన వారికి మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది.అదేవిధంగా స్టార్ హీరోలు రజనీకాంత్,కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారి చిత్రాలకు అదనంగా టికెట్ ధరను వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం చెన్నైలో టికెట్ ధరను రూ.50 నుంచి రూ.160 వరకూ నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో రూ. 140 వరకూ వసూలు చేసుకోవచ్చని సమాచారం.ఈ ధరలకు అధనంగా రూ. 100లకు పైగా ఉన్న ధరలపై జీఎస్టీ పన్ను 28 శాతం, అందుకు తక్కువ టికెట్ ధరపై 18 శాతం పడుతుంది. ఉదాహరణకు రూ. 160 టికెట్ ధర పై 28 శాతం జీఎస్టీ పన్ను కలిపితే రూ.205 అవుతుంది.దీనికి ఆన్లైన్ బుక్కింగ్ అయితే మరో రూ.30 చార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అంటే రూ.235 అవుతుంది. దీనికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్న చిత్ర పరిశ్రమకు చెందిన ఒకాయన తెలుపుతూ స్టార్స్ చిత్రాలకు టికెట్ ధర పెంచే విషయం గురించి చర్చల్లో ఆమోద ముద్ర పడినట్లు తెలిపారు.అయితే త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆ తరువాత కొత్త ధరలు అమలవుతాయని చెప్పారు.అదే విధంగా అనువాద చిత్రాలకు 10 నుంచి 15 శాతం వినోదపు పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు చెప్పారు. ఇంకా చర్చల్లోనే ఉంది కాగా తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఈ విషయమై మాట్లాడుతూ సినిమా టికెట్ల ధర పెంపు విషయం ఇంకా చర్చల్లోనే ఉందని చెప్పారు.తుది నిర్ణయం జరగలేదని అన్నారు.అయితే సినిమా టికెట్ల ధరను పెంచుకునే అధికారం ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికే ఇచ్చిందని తెలిపారు.కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో వార చివరి రోజుల్లో టికెట్లపై అధిక ధరలను వసూలు చేసే విధానాన్ని చెన్నైలో ఎందుకు అమలు పరచరాదని ఆయన ప్రశ్నించారు.మొత్తం మీద సగటు ప్రేక్షకుడికి ఇకపై సినిమాలు చుక్కల్ని చూపించబోతున్నాయన్నది వాస్తవం. -
సినిమా కష్టమే!
- జీఎస్టీతో 28 శాతం దాకా పెరగనున్న వినోదపన్ను - భారీగా పెరగనున్న సినిమా టిక్కెట్ల ధర - జులై 1 నుంచి అమల్లోకి రానున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప: పండగొచ్చినా.. సెలవొచ్చినా.. కొంచెం సమయం దొరికినా సామాన్య, మధ్యతరగతి వర్గాలు వినోదం కోసం సినిమాకు వెళతారు. ఇటీవల కాలంలో సినిమా థియేటర్ల నిర్వహణ ఖర్చు భారీగా పెరిగింది. ఆధునిక హంగులు సమకూర్చిన థియేటర్ల వైపే ప్రేక్షకులు పరుగులు పెడుతుండటంతో సినిమా థియేటర్ల నిర్వహణలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీ తట్టుకోలేక ఇప్పటికే అనేక థియేటర్లు కల్యాణ మండపాలుగా మారిపోయాయి. మార్కెట్లో పోటీ కారణంగా ఏ సెంటర్లలో టిక్కెట్టు ధర రూ.50 నుంచి రూ.120 దాకా పెరిగింది. టిక్కెట్టుతో పాటు తినుబండారాల ధరలు కూడా మోత మోగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి జనం కుటుంబసమేతంగా సినిమాకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. పెద్ద సినిమాల రిలీజు రోజు మినహా మిగిలిన రోజుల్లో అంతంత మాత్రం కలెక్షన్లతో థియేటర్లు ఇబ్బందిపడుతున్న తరుణంలో జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ప్రకారం ప్రస్తుతం 15 నుంచి 18 శాతం దాకా ఉన్న వినోదపు పన్ను ఏకంగా 28 శాతానికి పెరగనుంది. థియేటర్ యాజమాన్యాలు ఈ భారం ప్రేక్షకులపై వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వినోదం మరింత ఖరీదు కాబోతోంది. ఏడాదికి రూ 4 కోట్ల భారం ప్రొద్దుటూరులోని మల్టీఫ్లెక్స్‌తో కలుపుకొని జిల్లాలో ఏ, బీ, సీ సెంటర్లలో మొత్తం 54 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఏ సెంటర్లైన కడప, ప్రొద్దుటూరులో రూ.50 నుంచి టిక్కెట్టు ప్రారంభ ధర ఉంది. బీ, సీ సెంటర్లలో రూ.20 నుంచి టిక్కెట్టు ప్రారంభ ధర ఉంది. నూతన జీఎస్టీ విధానం అమలైతే జిల్లావ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరలు, అందులో విక్రయించే చిరుతిండ్లు, కూల్‌డ్రింక్‌ల రూపంలో ప్రేక్షకుల మీద ఏడాదికి రూ.4 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అనధికారిక అంచనా. టిక్కెట్టు ధరను బట్టి పన్ను విధింపు ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలకు 20 శాతం, తెలుగు సినిమాలకు 15 శాతం వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రకారం రూ.100లోపు టిక్కెట్టు ధర ఉంటే 18 శాతం, రూ.100 పైన టిక్కెట్టు ధర ఉంటే 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అన్ని సెంటర్లలో టిక్కెట్ల ధరలు పెరగడం అనివార్యమవుతుంది. జీఎస్టీ ద్వారా ఒక్కసారిగా 28శాతం దాకా పన్ను పెరగనుండటంతో థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. టిక్కెట్ల ధరలు పెంచితే ప్రేక్షకుల సంఖ్య తగ్గి తమ వ్యాపారం దెబ్బతింటుందనీ, ధర పెంచకపోతే ఆ మేరకు తామే అదనపు భారం భరించాల్సి వస్తుందనీ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం యాజమాన్యాలు భరించే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. మొత్తం మీద జీఎస్టీ పుణ్యమా అని సామాన్య, మధ్యతరగతి జనం సినిమా లాంటి చిన్న వినోదానికి కూడా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. -
సచిన్ సినిమాకు బొనాంజ!
ముంబై: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’.. సినీ, క్రికెట్ ప్రేమికుల్లో ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఒడిశా ప్రభుత్వం ఓ వరాన్ని ప్రకటించింది. ఒడిశాలో ఈ చిత్రంపై వినోదపన్నును మినయించింది. సచిన్ యువతకు ఎంతో ప్రేరణ ఇచ్చాడని, అందుకే అతని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపన్నును రాష్ట్రమంతటా మినహాయిస్తున్నామని ఒడిశా ఆర్థికమంత్రి శశిభూషణ్ బెహారా తెలిపారు. సచిన్ జీవితంలోని పలు అంశాలను స్పృశిస్తూ జేమ్స్ ఎర్స్కిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వినోద పన్నుపై వివరణ ఇవ్వండి
నిర్మాతలు గుణశేఖర్, రాజీవ్‌రెడ్డి, నటుడు బాలకృష్ణలకు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: వినోద పన్ను మినహాయింపు ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు అందడంలేదని, ఆ ప్రయోజనాలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, రుద్రమదేవి సినిమా నిర్మాత గుణశేఖర్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నిర్మాత రాజీవ్‌రెడ్డితో పాటు నటుడు నందమూరి బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి పొందిన వినోదపన్ను మినహాయింపు ప్రయోజనాలను నిర్మాతలే అనుభవిస్తున్నారని ఆ ప్రయోజనాలు ప్రేక్షకులకు కూడా వర్తింప చేయడానికి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను రాబట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘సినిమా’ పన్నుల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు
ఆశీర్వాద్ ఫిలిమ్స్ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలో నిర్మించిన చిత్రాలకు ఒక రకమైన పన్ను.. రాష్ట్రం వెలుపల నిర్మించిన చిత్రాలకు మరో రకం పన్ను విధిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 604ను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం చేసిన ఈ వర్గీకరణ ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమ ణియన్, జస్టిస్ జె.ఉమా దేవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సినిమాలు నిర్మించే ప్రాంతాలను బట్టి పన్ను రేట్లను నిర్ణయిస్తూ ఏపీ సర్కార్ 200 8 ఏప్రిల్ 22న జీవో 604 జారీ చేసింది. ఏపీ వినోద పన్ను చట్టం కింద కొన్ని విభా గాల్లోని చిత్రాలకు సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతాలను బట్టి వినోదపన్ను నుంచి మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఆశీర్వా ద్ ఫిలిమ్స్ అధినేత రాజన్ శర్మ 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన జస్టిస్ రామ సుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
నిర్మాతల కోసం వినోద పన్ను మినహాయింపు
దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకుల ప్రయోజనం కోసం కాకుండా సినిమాల నిర్మాతల కోసం వినోద పన్నును మినహాయింపునిస్తున్నాయని, దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు పొందిన నిర్మాతలు... దాని ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపచేయకుండా స్వలాభం పొందుతున్నారని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు పేర్కొన్నారు. అలాంటి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, తెలంగాణలో రుద్రమదేవి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన గుణ టీమ్ వర్క్స్, ఏపీలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన రాజీవ్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 100 శాతం మినహాయింపు చట్ట విరుద్ధం... మంచి సినిమాను ప్రోత్సహించడంలో భాగం గా ప్రభుత్వాలిచ్చే వినోద పన్ను మినహాయింపు మొత్తాన్నీ టికెట్ ధర నుంచి మినహా యించాలని పిటిషనర్ పిటిషన్లో తెలిపారు. రుద్రమదేవి సినిమాకి తెలంగాణ ప్రభుత్వం, గౌతమీపుత్ర శాతకర్ణికి ఉభయ ప్రభుత్వాలూ 100% వినోద పన్ను మినహాయించాయ న్నారు. నిబంధనల ప్రకారం 50% కిమించి పన్ను మినహాయింపు ఇవ్వరాదన్నారు. -
‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం
సాక్షి, అమరావతి: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సాగిలపడేందుకు సన్నాహాలు చేస్తోంది. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ నెల 9వ తేదీనే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. -
చారిత్రక అసత్యాలతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
పంజగుట్ట: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారని, సినిమా మొత్తం చారిత్రక అసత్యాలతో కూడి ఉందని పలువురు చరిత్రకారులు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి కొల్లూరి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధి డి.పి.రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ చరిత్రను, ఇక్కడి కళాకారులను ప్రొత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వడం సరికాదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు. (చదవండి : ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు ) వినోదపన్ను రద్దు కమిటీ నివేదిక లేకుండా పన్ను రద్దు చేశారని, వెంటనే పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. సినిమాలో పేర్కొన్నట్లుగా గౌతమీపుత్ర శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని, ఇతని తల్లి బాలశ్రీ నాసిక్‌లో వేయించిన శిలా శాసనములో ఈ విషయాన్ని పేర్కొనలేదని గుర్తుచేశారు. ఈయన భారతదేశం మొత్తం పాలించారని చూపారని, కాని కేవలం పశ్చిమ దక్కన్ పీఠభూమి మాత్రమే శాతకర్ణి ఆధీనంలో ఉందని తెలిపారు. శాతకర్ణి ఇండో గ్రీకు రాజైన డిమిట్రిస్తో యుద్ధం చేశాడన్నది చారిత్రక అసత్యమని, డిమిట్రిస్ క్రీస్తుపూర్వం 312కు చెందిన వారని, అతనికి శాతకర్ణికి 390 సంవత్సరాలు తేడా ఉందన్నారు. అతను తెలంగాణ వారిగా చూపారని, కాని మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవపట్టించి డబ్బులు సంపాదించుకునేందుకు సినిమా బృందం వినోదపన్ను రద్దు చేయించుకుని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతోందని ఆరోపించారు. -
మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు. ‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్ కోరారు. -
బాలకృష్ణకు చంద్రబాబు కానుక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బావమరిది, ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారు. ఆయన నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. ఆంధ్రుల చరిత్ర ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ రూపొందించారు. చిత్రం ప్రారంభమైన సందర్భంలోనే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినాహాయింపు కోరాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా ఎంచుకుని పరిపాలన గావించిన గొప్ప రాజుకు చెందిన చరిత్రనే సినిమాగా రూపొందించిన నేపథ్యంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయరనే యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వినోద పన్నును మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
సినిమా థియేటర్లపై నజర్
వినోద పన్ను వసూళ్లే లక్ష్యం ఆన్లైన్లో టిక్కెట్ల అనుసంధానం {పత్యేక స్టాప్వేర్కు కసరత్తు సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచి వినోద పన్నును పకడ్బందీగా వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. థియేటర్ల టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ కూడా నిర్ణయం తీసుకోవడంతో ప్రయోగాత్మకంగా గ్రేటర్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ వెబ్సైట్ లు, థియేటర్లలో జరిగే టిక్కెట్ల అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వాణిజ్యపన్నుల శాఖలో రికార్డ్ అయ్యేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)తో సమన్వయం చేసుకొని, థియేటర్లలో జరిగిన టిక్కెట్ల అమ్మకాలను ఎఫ్డీసీ ద్వారా శాఖకు చేరేలా సాఫ్ట్వేర్ రూప కల్పన చేసేందుకు చర్యలు చర్యలు చేపట్టారు. టికెట్ల అమ్మకాలను బట్టి వినోద పన్నును వసూలు చేయవచ్చని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ఇప్పటి వరకు వినోద పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తిగా వెనుకబడి ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రత్యేక యాప్ అమలేదీ..? వాణిజ్య పన్నుల శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినా అమలు ఆచరణలో లేకుండా పోయింది గతేడాది సీజీజీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్ (ఆన్లైన్ విధానం) ద్వారా థియేటర్ పేరు, లెసైన్స్, చిరునామా, ప్రదర్శనల సంఖ్య, మొత్తం సీట్లు.. భర్తీ అయిన సీట్లు తదితర వివరాలను సినిమా ప్రారంభం కాగానే యజమానులు పంపించాల్సి విధంగా చర్యలు చేపట్టారు .కానీ ఆచరణలో అమలు మాత్రం లేకుండా పోయింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ కొత్త తరహా సాఫ్ట్ వేర్ రూప కల్పనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
కేబుల్ కనెక్షన్లపై వినోద పన్ను
హైదరాబాద్‌లో కనెక్షన్‌పై రూ.5 వసూలుకు నిర్ణయం కేబుల్ ఆపరేటర్లకు వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమైన ఆపరేటర్లు ఈ నెల నుంచే అమల్లోకి.. గ్రేటర్‌పై నెలసరి పన్ను భారం రూ. 1.20 కోట్ల పైనే సాక్షి, హైదరాబాద్: వినోద సాధనమైన కేబుల్ టీవీ మరింత భారం కానుంది. వాణిజ్య పన్నుల శాఖ వినోదం పేరుతో ‘పన్ను’ పీకేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అన్ని మార్గాలపై దృష్టిసారించిన ఈ శాఖ.. తాజాగా కేబుల్ టీవీ కనెక్షన్లపై కన్నేసింది. తొలుత నగరంలోని వినియోగదారుల నుంచి వినోద పన్ను వసూలు చేసేందుకు సిద్ధమైంది. మహా నగర పరిధిలో కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా వినోద పన్ను వసూలుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాస్తవంగా జీహెచ్ఎంసీ కేబుల్ టీవీ కనెక్షన్ల చార్జీలపై 20 శాతం వినోద పన్ను వసూలు చేసి అందులో రెండు శాతాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆయితే జీహెచ్ఎంఎసీ అధికారులు కేబుల్ కనెక్షన్ల రాబడిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వినోద పన్ను వసూళ్లు లేకుండాపోయాయి. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా ఒక అడుగు ముందుకేసి కేబుల్ కనెక్షన్లపై నేరుగా వినోద పన్నులోని తన వాటాను వసూలు చేసేందుకు తయారైంది. అక్టోబర్ నుంచి కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్‌పై నెలకు రూ.5 వినోద పన్ను చెల్లించాలని ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. 24 లక్షల కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, మరో 4 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌ఓగా ఉన్న సిటీ కేబుల్, హాత్వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ఎమ్ఎస్ఓల కంట్రోల్ రూమ్ నుంచి ట్రంక్ లైన్ ద్వారా ప్రసారాలు స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అందుతాయి. కేబుల్ ఆపరేటర్లు స్థానిక కేంద్రాల ద్వారా వినియోగదారులకు ప్రసారాలు అందిస్తున్నారు. నగరంలో రెండు వేల మంది పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వినియోగదారులకు కేబుల్ ద్వారా ప్రసారాలు అందిస్తున్నందుకు నెలకు రూ.150-200 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వినోద పన్ను భారాన్ని వినియోగదారులపైనే మోపేందుకు కేబుల్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న నెలసరి చార్జీలతో పాటు అదనంగా రూ.5 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన గ్రేటర్‌లోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.1.20 కోట్ల అదనపు భారం పడనుంది. వినియోగదారులు వినోద పన్నును తమ ఆపరేటర్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలని కొన్ని ఎంఎస్ఓలు స్క్రోలింగ్ ఇవ్వడం గమనార్హం. -
రుద్రమదేవి’కి వినోదపన్ను మినహాయింపు
సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు... దర్శకుడు గుణశేఖర్‌కు ప్రశంసలు హైదరాబాద్: కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన అంశంతో నిర్మించిన రుద్రమదేవి చిత్రానికి వినోద పన్ను నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజు, చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబసభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. రుద్రమదేవి సినిమాను చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు గుణశేఖర్‌ను సీఎం అభినందించారు. ఇలాంటి మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చరిత్ర, ఇక్కడి రాజవంశీయుల గొప్పతనానికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకోవడం పట్ల దర్శక నిర్మాతను అభినందించారు. ఇలాంటి చిత్రాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. -
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
-
'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు
ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 9న రిలీజ్‌కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతోంది. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు. గుణశేఖర్, రుద్రమదేవి సినిమా చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. -
న్యూ ఇయర్ వేడుకలకు వినోదపన్ను
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం(2015) సందర్భంగా నిర్వహించే వేడుకలు వినోదపన్ను పరిధిలోకే వస్తాయని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వాహకులు ముందుగా సంబంధిత వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు సమాచారం అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారం అందించకుండా, వినోదపన్ను చెల్లించకుండా ఈవెంట్లు నిర్వహించే వారి పట్ల వాణిజ్య పన్నుల శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నిర్వాహకులపై ఐదు రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు వాణిజ్యపన్నుల శాఖ సర్కిల్ అధికారులను కానీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం జాయింట్ కమిషనర్(9949994728)ను గాని సంప్రదించాలని తెలిపారు. -
కొత్త సంవత్సర పార్టీలకు ట్యాక్స్ కట్టాల్సిందే!