బాలకృష్ణకు చంద్రబాబు కానుక | gowtami putra satakarni exemption from entertainment tax | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు చంద్రబాబు కానుక

Published Mon, Jan 9 2017 10:01 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

బాలకృష్ణకు చంద్రబాబు కానుక - Sakshi

బాలకృష్ణకు చంద్రబాబు కానుక

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బావమరిది, ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారు. ఆయన నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. ఆంధ్రుల చరిత్ర ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ రూపొందించారు.

చిత్రం ప్రారంభమైన సందర్భంలోనే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినాహాయింపు కోరాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా ఎంచుకుని పరిపాలన గావించిన గొప్ప రాజుకు చెందిన చరిత్రనే సినిమాగా రూపొందించిన నేపథ్యంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయరనే యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వినోద పన్నును మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement