
సచిన్ సినిమాకు బొనాంజ!
ముంబై: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’.. సినీ, క్రికెట్ ప్రేమికుల్లో ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఒడిశా ప్రభుత్వం ఓ వరాన్ని ప్రకటించింది. ఒడిశాలో ఈ చిత్రంపై వినోదపన్నును మినయించింది.
సచిన్ యువతకు ఎంతో ప్రేరణ ఇచ్చాడని, అందుకే అతని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపన్నును రాష్ట్రమంతటా మినహాయిస్తున్నామని ఒడిశా ఆర్థికమంత్రి శశిభూషణ్ బెహారా తెలిపారు. సచిన్ జీవితంలోని పలు అంశాలను స్పృశిస్తూ జేమ్స్ ఎర్స్‌కిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.