sachin a billion dreams
-
సచిన్ సినిమాకు బొనాంజ!
ముంబై: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’.. సినీ, క్రికెట్ ప్రేమికుల్లో ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఒడిశా ప్రభుత్వం ఓ వరాన్ని ప్రకటించింది. ఒడిశాలో ఈ చిత్రంపై వినోదపన్నును మినయించింది. సచిన్ యువతకు ఎంతో ప్రేరణ ఇచ్చాడని, అందుకే అతని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపన్నును రాష్ట్రమంతటా మినహాయిస్తున్నామని ఒడిశా ఆర్థికమంత్రి శశిభూషణ్ బెహారా తెలిపారు. సచిన్ జీవితంలోని పలు అంశాలను స్పృశిస్తూ జేమ్స్ ఎర్స్కిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘నా సినిమాకు మోదీ ఆశీర్వాదం తీసుకున్న’
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. భార్య అంజలితో కలిసి ప్రధాని కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం వచ్చే శుక్రవారం (మే 26) విడుదల కానున్న నేపథ్యంలో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా తాను చిత్రం విశేషాలకు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి క్లుప్తంగా వివరించానని పేర్కొంటూ మోదీతో కరాచలనం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు సచిన్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని తనకు శుభాకాంక్షలు చెప్పారని అన్నారు. హాలివుడ్ దర్శకుడు జెమ్స్ ఎర్సకైన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సచిన్ జీవితంలో ఎవ్వరికీ తెలియని అంశాలు చాలా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సచిన్ వ్యక్తిగత జీవితం నుంచి యువకుడిగా క్రికెట్‌కు ఒక కలికితురాయిగా మారిన తీరు వరకు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపునిచ్చాయి. -
సచిన్ సినిమా పాట వచ్చేసింది
-
సచిన్ సినిమా పాట వచ్చేసింది
ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 44వ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలిపాటను విడుదల చేశారు. 'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు. సచిన్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో నిర్మాత రవి భగ్చంద్కా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే నెల 26న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో సచిన్ బాల్యం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్య ఘట్టాల గురించిన సన్నివేశాలుంటాయి. 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్ అందుకునే దృశ్యాలను పదేళ్ల సచిన్ టీవీలో చూసే సన్నివేశం నుంచి ఓ రోజు అతనే ప్రపంచ కప్‌ను అందుకునే వరకు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాగా చిత్రీకరించారు. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. -
యూట్యూబ్‌లో సచిన్ సంచలనం
మైదానంలోకి అతడు అడుగు పెడుతున్నాడంటే చాలు.. స్టేడియంలో ఉన్న జనాలంతా ఒక్కసారిగా లేచి ఓ... అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అతడు సెంచరీకి చేరువ అయ్యాడంటే అంతా కలిసి ’సాచిన్.. సాచిన్’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు.. వెండితెర మీద కూడా సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. బయోపిక్‌లు తీయడంలో అందెవేసిన చేయి అయిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ’సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్‘ సినిమా ట్రైలర్ గురువారం రాత్రి విడుదలైంది. అప్పుడే యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూలు ఆ ట్రైలర్‌కు వచ్చాయి. అన్నతో కలిసి చిన్నతనంలో పార్కింగ్ చేసి ఉంచిన కారు టైరులోని గాలి తీసేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 2 నిమిషాల 13 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో తొలిసారి బ్యాట్ పట్టుకున్నప్పటి మధుర స్మృతులు, టీమిండియా మొదటిసారి ప్రపంచకప్ గెలిచినప్పటి సంబరాలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలో తాను చూసిన మ్యాచ్‌లు, రమాకాంత్ ఆచ్రేకర్ శిష్యరికంలో నేర్చుకున్న పాఠాలు.. ఒకానొక సమయంలో తన ఇంటి మీద పడిన రాళ్లు, దిష్టిబొమ్మలు తగలబెట్టిన నిరసనలు, తీవ్రంగా మధనపడి.. మళ్లీ మైదానంలో మెరిసిన క్షణాలు, కోట్లాదిమంది అభిమానులు తమ గుండెల్లో గుడికట్టి పూజించిన వైనం.. పదో నెంబరు జెర్సీ.. ఇలా అన్ని విషయాలూ కనిపిస్తాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుంది. రవి భగ్చాంద్కా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైతే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. The stage is set and we are ready to begin… #SachinTrailer is out now. Here it is! https://t.co/T3oWyZw3DL — sachin tendulkar (@sachin_rt) 13 April 2017