ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం | Gautamiputra Satakarni team visits Vijayawada Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం

Published Fri, Jan 13 2017 8:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం

ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సినీ నటుడు బాలకృష్ణ,  హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ లు దర్శించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాలకృష్ణ బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ, దర్శకుడు క్రిష్ లకు అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ పండుగను తమ సొంత ఊరిలో బంధువుల మధ్య జరుపుకుంటానని అన్నారు. తెలుగు పౌరుషాన్ని దేశానికి చాటిచెప్పిన శాతకర్ణి సినిమాలో నటించడం, దానిని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా వుందని అన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement