ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కు సంబందించి రోజుకో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో సందడి చేస్తోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జీయలో భారీ యుద్ధ సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటోంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారు. అదే బాటలో మరో టాప్ డిజైనర్ గౌతమీ పుత్ర శాతకర్ణి టీంతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
దేవదాస్, జోథా అక్బర్ లాంటి సినిమాలకు పనిచేసి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా మూడు జాతీయ అవార్డులు సాధించిన నీతూలుల్లా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా టీంలో జాయిన్ అయ్యింది. ఇప్పటికే దర్శకుడు క్రిష్, సినిమాటోగ్రఫర్ జ్ఞాన శేఖర్లతో చర్చలు జరిపిన నీతా సినిమాకు నేపథ్యానికి తగ్గ కాస్ట్యూమ్స్ను సిద్దం చేస్తున్నారు. రెగ్యులర్ ఫోక్ లోర్ సినిమాల తరహాలో కాకుండా.. శాతవాహనుల కాలంలో వారి సంస్కృతి సాంప్రదాయాలపై రిసెర్చ్ చేసి అలాంటి దుస్తులనే సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా యుద్ద వీరులు వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య కోసం బాలీవుడ్ డిజైనర్
Published Sat, Jul 16 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement