
వర్మ క్షమాపణలు కోరాడు..!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా ఫాలోవర్స్కు షాక్ ఇచ్చాడు. ఎప్పుడు నేనింతే.. నాఇష్టం అంటూ అడ్డంగా మాట్లాడే వర్మ, అనూహ్యంగా సారీ చెప్పాడు. గతంలో మెగా ఫ్యామిలీ హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నన్ను క్షమించండి అంటూ అభిమానులను కోరాడు. సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ 'మెగాస్టార్ లుక్ అమేజింగ్, ఈ లుక్ చూస్తుంటే సినిమా గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది. ఇది మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ లుక్. ఖైదీ నంబర్ 150 సూపర్ క్లాసీ, సూపర్ ఇంటెన్స్ లుక్. ఈ లుక్ చూసిన తరువాత నేను గతంలో చేసిన కామెంట్స్ విషయంలో మెగా అభిమానులను క్షమాపణ కోరాలనుకుంటున్నాను'. అంటూ కామెంట్ చేశాడు.
Mega Star's Look is Amazingly Mindblowing...Looks Like A Sure Shot Block Buster..Million Cheers