దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్ | khaidi number 150 ammadu lets du kummudu teaser | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్

Published Sun, Dec 18 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్

దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్

హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ మూవీకి సంబంధించిన ఓ పాట ‘అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు’ అనే సాంగ్‌ టీజర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది. యూట్యూబ్‌లో అప్ లోడ్ ఇలా చేశారో లేదో అంతే.. మెగా అభిమానులు ఈ టీజర్ ను ఓ రేంజ్ లో వీక్షిస్తున్నారు. అందులోనూ మెగాస్టార్ మూవీ అంటే ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. నిమిషానికి వేల వ్యూస్ తో రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ మూవీ దర్శకుడు వీవీ వినాయక్‌ చెప్పినట్లుగానే 'అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు.. ఎర్రచీర ఈరోజే కొన్నాను' అనే సాంగ్ లిరిక్స్ టీజర్ విడుదలైంది. వీడియోలో లిరిక్స్ తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఉత్సాహ పరుస్తాయనడంలో సందేహమే లేదు.

సాంగ్ కంపోజింగ్ పై మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. చిరంజీవిగారి మూవీకి మ్యూజిక్ ఇవ్వడం గౌరవంగా భావిస్తాను. కింగ్ ఆఫ్ మాస్ ఈజ్ బ్యాక్ టు రాక్ అని తన ట్వీట్ లో దేవీశ్రీ పేర్కొన్నాడు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేయనున్నారు. చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement