మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా మెగా అభిమానులు ఒకరోజు ముందే గిప్ట్ అందుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' మూవీలోని 'సుందరి' అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన చిరు లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిన్న తన ట్విట‍్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాట విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వీక్షించారు.