sundari song
-
ఖైదీ నెం.150 పాట ఆన్లైన్లో లీక్!
దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 సినిమా థియేటర్లలో అలా విడుదలయ్యిందో లేదో.. అప్పుడే అందులోని ఒక పాట మొత్తం ఆన్లైన్లో లీకైపోయింది. పైరసీని అరికట్టేందుకు ఎంతగా పోరాటం జరుగుతున్నా, సినిమాలు విడుదల అవుతూనే వాటిలోని పాటలు, మొత్తం సినిమా కూడా ఈ మధ్య కాలంలో వెంటవెంటనే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఖైదీ నెం. 150 లోని 'సన్న జాజిలా పుట్టేసిందిరో.. మల్లె తీగలా చుట్టేసిందిరో.. తేనెటీగలా కుట్టేసిందిరో సుందరీ ఈ సుందరీ' అనే పాట ఇప్పుడు ఆన్లైన్లో లీకై, వైరల్‌గా స్ప్రెడ్ అవుతోంది. దీనిపై సినిమా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎంతో కష్టపడి తాము సినిమా తీస్తుంటే, నిమిషాల వ్యవధిలోనే ఇలా ఆన్లైన్లో లీక్ చేయడం వల్ల అన్ని వర్గాలూ నష్టపోతున్నాయని అంటున్నారు. -
ఖైదీ నెం.150 పాట ఆన్లైన్లో లీక్!
-
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
-
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
హైదరాబాద్ : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా మెగా అభిమానులు ఒకరోజు ముందే గిప్ట్ అందుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' మూవీలోని 'సుందరి' అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన చిరు లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాట విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వీక్షించారు. ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు అత్యథిక హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్‌ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. ఈ పాటను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్‌కు ఇన్ని లక్షల వ్యూస్ రావడం అరుదని లహరి మ్యూజిక్ ట్వీట్ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రీ ట్వీట్ చేశాడు. తొమ్మిదేళ్లు విరామం తర్వాత అయినప్పటికీ అమ్మడు పాట ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న చిరు తాజాగా సుందరీ అంటూ మళ్లీ దుమ్మరేపనున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. మరి ‘సుందరి’ ‘అమ్మడు లెట్స్ కుమ్ముడు’ రికార్డులను బ్రేక్ చేసి సునామీ సృష్టిస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా పాటలు ఆదివారం డైరెక్ట్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.