అందాల భామ త్రిపాత్రాభినయం | Raai Laxmi Triple Roles in Cinderella | Sakshi
Sakshi News home page

అందాల భామ త్రిపాత్రాభినయం

Published Sat, Jun 8 2019 10:04 AM | Last Updated on Sat, Jun 8 2019 10:04 AM

Raai Laxmi Triple Roles in Cinderella - Sakshi

సరైన సక్సెస్‌ కోసం పోరాడుతున్న సీనియర్‌ హీరోయిన్లలో నటి రాయ్‌లక్ష్మీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటించే అవకాశాలు మాత్రం వస్తున్నాయి కానీ, విజయాలే కానరావడం లేదు. ఆ మధ్య ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలని జూలీ–2 చిత్రంలో బోల్డ్‌గా నటించారు. అయినా సక్సెస్‌ మాత్రం దక్కలేదు. తెలుగులో ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో రత్తాలు రత్తాలు అనే పాటలో యువతను ఉర్రూతలూగించారుత. 

సక్సెస్‌ లేకపోయినా ఇంకా కథానాయకిగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు నటించిన నీయా 2 తెరపైకి వచ్చింది. అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా అందులో ప్రియురాలిగా నాగుపాముగా తన పాత్రకు న్యాయం చేసిందనే ప్రశంసలను అందుకున్నారు. కాగా తాజాగా నటిస్తున్న చిత్రంపై రాయ్‌లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రమే సిండ్రెల్లా. ఇది హర్రర్‌ ఇతివృత్తంతో కూడిన చిత్రం అట.

విశేషం ఏమిటంటే ఈమూవీలో తొలిసారిగా రాయ్‌లక్ష్మీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. అందులో ఒకటి టైటిల్‌ పాత్ర సిండ్రెల్లా. ఇంకో పాత్ర రాక్‌స్టార్‌గా ఉంటుందని, మరో పాత్ర గురించి ప్రస్తుతానికి సప్సెన్స్‌ అని అని చిత్ర వర్గాలు పేర్కొన్నారు.

కొత్త దర్శకుడు వినూ వెంకటేశ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కొడైక్కెనాల్‌లో పూర్తి చేసుకుందని, త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. మరో పాత్రలో నటి సాక్షీ అగర్వాల్‌ నటిస్తోంది. పలు ట్విస్ట్‌లతో సాగే ఈ సిండ్రెల్లా చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు చిత్ర వర్గాలు. మరి ఈ చిత్రం అయినా నటి రాయ్‌లక్ష్మీని సక్సెస్‌తో సంతోష పెడుతుందో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement