Cinderella
-
భయపెట్టే సిండ్రెల్లా
లక్ష్మీ రాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సిండ్రెల్లా’. ఈ సినిమాలో ఆమె మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మంగళవారం లక్ష్మీ రాయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేస్తున్న మూడు పాత్రల్లో తులసి పాత్ర ఒకటి. ఆ పాత్రకు సంబంధించిన లుక్ నే విడుదల చేశారు. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యాంటసీ, హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ‘‘సిండ్రెల్లా, తులసి, రాక్ స్టార్ గా ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాను. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుంది’’ అన్నారు లక్ష్మీ రాయ్. -
హర్రర్ చిత్రంలో రాయ్‌లక్ష్మి
చెన్నై : ప్రపంచవ్యాప్తంగా దేవతా కథల్లో ప్రాముఖ్యంగా వినిపించే పేరు ‘సిండ్రెల్లా’. ఈ పేరుతో ప్రస్తుతం తమిళంలో ఒక దెయ్యపు చిత్రం రూపొందుతోంది. ఇందులో రాయ్‌లక్ష్మి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వినో వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈయన ఎస్జే సూర్య వద్ద సహాయ దర్శకునిగా ఉన్నారు. సిండ్రెల్లా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఇదొక దెయ్యపు చిత్రమేనని, అయితే దెయ్యపు చిత్రాలకు ఇక్కడున్న హైదర్ కాలపు ఫార్ములా నుంచి వైదొలగి, అన్ని అంశాలతో ఒక స్పీడ్ చిత్రంగా ఇది రూపొందినట్లు తెలిపారు. రాయ్‌లక్ష్మి పోషించిన పాత్ర ఆమె ఇమేజ్ను ఎంతగానో మారుస్తుందన్నారు. ఆమెను ఇంతవరకు గ్లామర్ పాత్రల్లో చూసిన అభిమానులకు ఊహించని రీతిలో ఈ చిత్రంలో కనిపిస్తుందన్నారు. సాక్షి అగర్వాల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక కథాపాత్రలో కనిపిస్తారన్నారు. ఆమె పోషిస్తున్న ప్రతినాయకురాలి పాత్ర విలనిజంను కొత్త కోణంలో చూపిస్తుందన్నారు. గాయని ఉజ్జయిని గజరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. కాంచన–2 చిత్రానికి సంగీతం సమకూర్చిన అశ్వమిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాధారణ దెయ్యపు చిత్రాలకు భిన్నంగా కొత్త కథతో పయనించే కథా చిత్రం ఇది. తమిళం, తెలుగు రెండు భాషల్లో నిర్మిస్తున్న సిండ్రెల్లా చిత్రం ఎంటర్టెయిన్మెంట్కు పూర్తి గ్యారెంటీ ఇస్తుందన్నారు. -
అందాల భామ త్రిపాత్రాభినయం
సరైన సక్సెస్ కోసం పోరాడుతున్న సీనియర్ హీరోయిన్లలో నటి రాయ్‌లక్ష్మీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటించే అవకాశాలు మాత్రం వస్తున్నాయి కానీ, విజయాలే కానరావడం లేదు. ఆ మధ్య ఎలాగైనా బాలీవుడ్లో పాగా వేయాలని జూలీ–2 చిత్రంలో బోల్డ్‌గా నటించారు. అయినా సక్సెస్ మాత్రం దక్కలేదు. తెలుగులో ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో రత్తాలు రత్తాలు అనే పాటలో యువతను ఉర్రూతలూగించారుత. సక్సెస్ లేకపోయినా ఇంకా కథానాయకిగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు నటించిన నీయా 2 తెరపైకి వచ్చింది. అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా అందులో ప్రియురాలిగా నాగుపాముగా తన పాత్రకు న్యాయం చేసిందనే ప్రశంసలను అందుకున్నారు. కాగా తాజాగా నటిస్తున్న చిత్రంపై రాయ్‌లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రమే సిండ్రెల్లా. ఇది హర్రర్ ఇతివృత్తంతో కూడిన చిత్రం అట. విశేషం ఏమిటంటే ఈమూవీలో తొలిసారిగా రాయ్‌లక్ష్మీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. అందులో ఒకటి టైటిల్ పాత్ర సిండ్రెల్లా. ఇంకో పాత్ర రాక్‌స్టార్‌గా ఉంటుందని, మరో పాత్ర గురించి ప్రస్తుతానికి సప్సెన్స్ అని అని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కొత్త దర్శకుడు వినూ వెంకటేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కొడైక్కెనాల్లో పూర్తి చేసుకుందని, త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. మరో పాత్రలో నటి సాక్షీ అగర్వాల్ నటిస్తోంది. పలు ట్విస్ట్‌లతో సాగే ఈ సిండ్రెల్లా చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు చిత్ర వర్గాలు. మరి ఈ చిత్రం అయినా నటి రాయ్‌లక్ష్మీని సక్సెస్‌తో సంతోష పెడుతుందో లేదో చూడాలి. -
డబుల్ ధమాకా
రాయ్‌లక్ష్మికి నిన్న (ఆదివారం) స్పెషల్ డే. ఎందుకంటే ఆమె నటిస్తున్న రెండు సినిమాల ఫస్ట్ లుక్‌లు ఒకే రోజు విడుదలయ్యాయి. తమిళంలో రాయ్‌లక్ష్మి నటిస్తున్న ఫాంటసీ కమ్ హారర్ మూవీ ‘సిండ్రెల్లా’. ఈ సినిమాతో వినోద్ వెంకటేశ్ కోలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆమె తెలుగులో నటిస్తున్న హాస్య భరిత చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. ఈ సినిమాతో కిషోర్ కుమార్ దర్శకునిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ‘సిండ్రెల్లా, వేర్ ఈజ్ ద వెంటకలక్ష్మి’ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్స్ ఆదివారం విడుదల అయ్యాయి. ‘‘నా రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ యాదృచ్ఛికంగా ఒకే రోజు రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమాలో ప్రవీణ్, మధునందన్‌తో కలిసి పనిచేయడం బాగుంది. సెట్లో చాలా సరదాగా ఉంటున్న ‘సిండ్రెల్లా’ టీమ్‌కి కూడా థ్యాంక్స్. త్వరలో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఎలాగైతేనేం.. దీపావళికి ముందుగానే తన అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు రాయ్‌లక్ష్మి. -
స్త్రీలోక సంచారం
ఏషియన్ గేమ్స్‌లో 50 కేజీల డివిజన్లో బంగారు పతకం గెలిచుకుని ఇండియా తిరిగొచ్చిన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్‌కు, శనివారం విమానం దిగడంతోనే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె 24వ జన్మదినోత్సవం నాడే రెండు కుటుంబాల సమక్షంలో చిరకాల స్నేహితుడైన ‘గ్రెకో–రోమన్’ స్టెయిల్ జాతీయ రెజ్లర్ సోమ్‌వీర్ రాథీతో నిశ్చితార్థం జరిగింది. జావెలీన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో వినేశ్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తున్న వదంతులు ఈ నిశ్చితార్థంతో ఆగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వదంతుల్ని ఆపడం కోసమే ఈ నిశ్చితార్థం జరిగిందన్నా అన్న ప్రశ్నకు వినేశ్ నవ్వుతూ, ‘‘ప్రతి బర్త్‌డే ముందూ ఏదో ఒక ఈవెంట్లో నేను ఓడిపోవడం జరుగుతోంది. అనేక ఎదురుచూపుల తర్వాత దక్కిన ఈ అపురూపమైన విజయానికి నా జీవితంలోని మరొక అపురూపమైన సందర్భాన్ని జత చేయాలనుకుని నా ఫ్రెండ్ సోమ్‌వీర్, నేను పెద్దల అంగీకారంతో ఉంగరాలు మార్చుకున్నాం’’ అని చెప్పారు. పెద్దగా హానికరం కానివి అయిన నాలుగు ఇన్ఫెక్షన్లు.. టాక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగాలోవైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్.. గర్భిణుల విషయంలో మాత్రం ప్రాణాంతకంగా పరిణమించి గర్భస్రావాలకు, శిశువులో పుట్టుక లోపాలకు, మృత శిశువులు జన్మించడానికి కారణం అవుతున్నాయని హైదరాబాద్‌లోని ప్రిన్సెస్ ఎస్రా హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని మైక్రోబయోలజీ విభాగం నుంచి ఒక బృందం, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ లోని ఫార్మాస్యూటికల్ మైక్రోబయోలజీ నుంచి ఒక బృందం కలిసి చేసిన అధ్యయనంలో పై నాలుగు వైరస్ల వల్ల చిన్న ప్రాణానికంటే పెద్ద ప్రాణానికే ఎక్కువగా ముప్పు వాటిల్లుతున్న విషయం బయటపడింది! పదేళ్ల క్రితం 2007 డిసెంబరులో విజయవాడలో జరిగిన 19 ఏళ్ల బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో.. ట్రయల్ కోర్టులో భద్రపరిచిన ఆమె ఒంటి మీది బట్టలు, ఇతర ధారణలు (సంఘటన జరిగిన రోజువి).. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దోషులు పైకోర్టుకు అప్పీల్ చేసుకోడానికి ముందే పాడైపోయాయని ఆయేషా తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నాలుగు వారాల లోపు తమకు సమర్పించాలని ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ని ఆదేశించింది. ట్రయల్ కోర్టు సత్యంబాబు అనే యువకుడిని దోషిగా నిర్ధారించడంలో ఏకపక్షంగా వ్యవహరించిందని అభిప్రాయపడుతూ ఆ తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు, అప్పటికి పదేళ్లుగా జైల్లో ఉన్న సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన అనంతరం ఈ కేసు విచారణ ‘సిట్’ పరిధిలోకి వెళ్లింది. దావూదీ బోరా’ కమ్యూనిటీలో ఉన్న ‘ఫిమేల్ జెనిటల్ సర్కమ్‌సిషన్’ (బాలికల జననాంగానికి చేసే సున్తీ) ఆచారాన్ని నిషేధించాలని కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యానికి (పిల్) వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మాజీ అటార్నీ జనరల్ దివంగత గూలమ్ ఇ.వాహనవతి భార్య నఫీసా వాహనవతి తన మద్దతు ప్రకటించారు! ఈ విషయమై నఫీసా తరఫు న్యాయవాది మీనాక్షీ అరోరా.. సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. ఫిమేల్ జనిటల్ సర్కమ్‌సిషన్ అంటే క్లిటారిస్‌ను కత్తిరించడం అని ‘పిల్’లో పేర్కొన్నారనీ, నిజానికి అది క్లిటారిస్ పైన ఉండే చర్మాన్ని తొలగించడం మాత్రమేనని వివరించారు. మయన్మార్‌లోని 30 పోలీస్ స్టేషన్ల పైన, ఒక సైనిక స్థావరం మీద ‘అరహన్ రొహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ దాడులు జరిపినందుకు ప్రతీకారంగా గత ఏడాది ‘రోహాన్’ రాష్ట్రంలోని రొహింగ్యాలపై ప్రభుత్వ దళాలు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కాపాడు కోవడం కోసం పారిపోయి.. చెట్టుకొకరు పుట్టకొకరు అయిన 7 లక్షల మంది శరణార్థులలో వేలాదిమంది యువతులు, మహిళలు, బాలికలు.. అత్యాచారాలకు, లైంగిక హింసలకు గురై దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి దర్యాప్తు బృందాలు తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ మారణహోమాన్ని ఉద్దేశపూర్వకంగా నివారించలేకపోయిన మయన్మార్‌పై ఆంక్షలు విధించడంతో పాటు.. ఆ దేశాన్ని అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి ఈడ్చాలని కూడా యు.ఎన్. దర్యాప్తు నివేదిక.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సూచించింది. స్త్రీల అణచివేత ఉన్న వాతావరణంలో కన్నా.. స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వం ఉన్న చోట్లే ఎక్కువగా మహిళల నుంచి సెక్సీ సెల్ఫీలు ఆన్లైన్లో పోస్ట్ అవుతున్నట్లు ‘నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయన వ్యాసం వెల్లడించింది. స్త్రీ సౌందర్యీకరణ ఉన్న చోట స్త్రీ సాధికార త సాధ్యం కాదనే అభిప్రాయానికి భిన్నంగా తమ అధ్యయన ఫలితాలు ఉన్నట్లు చెబుతూ, ఇందుకోసం 113 దేశాలలోని వేలాది సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన మీదట ఒక ఈ విధమైన ముగింపునకు వచ్చామని అధ్యయనానికి సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ ప్రొఫెసర్ ఖండిస్ బ్లేక్ ఆ వ్యాసంలో రాశారు. సుసాన్ అనే కెనడియన్ వధువు, ముందుగా తను కోరినప్పటికీ ఎవరూ తన పెళ్లికి నగదు బహుమతి పంపించనందుకు కలత చెంది, పెళ్లిని రద్దు చేసుకుని, ఆ విషయాన్ని ఫేస్బుక్లో ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ‘‘అందరూ వినండి. మీరు తగినన్ని నగదు బహుమతులు ఇవ్వకుంటే మా.. నవ జీవితం ఎలా ప్రారంభం అవుతుంది? అందుకే నేను, నా చిన్ననాటి స్నేహితుడైన వరుడు ఈ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాం. ఇందుకు పూర్తిగా బాధ్యత వహించవలసింది మీరే’’ అంటూ ఆమె ఆ సుదీర్ఘమైన పోస్టును ముగించింది. ‘వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి’ అనే టైటిల్‌తో ప్రారంభమైన హారర్, కామెడీ తెలుగు చిత్రంలో రాయ్ లక్ష్మి.. సెక్సీ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నారు. లక్కీ లక్కీ రాయ్ (బలుపు), తౌబా తౌబా.. (సర్దార్ గబ్బర్ సింగ్), అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెం. 150) పాటలతో యువతరాన్ని డాన్స్ చేయించిన రాయ్ లక్ష్మి.. ఇప్పుడీ కొత్త సెక్సీ పాత్రలో ఒక అంతర్లీన సందేశాన్ని కూడా యూత్‌కి ఇవ్వబోతున్నారట. -
సిండ్రిల్లాకు ఓకే!
తమిళ సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ దాటి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్‌లక్ష్మి. బాలీవుడ్ చిత్రం జూలీ–2 ఆశించిన విజయం సాధించకపోయినా, అక్కడ తనదైన ముద్ర వేసుకున్న రాయ్‌లక్ష్మి.. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్నారు. బాలీవుడ్లో యార్, నీయా 2 చిత్రాలతో పాటు మలయాళంలో నాలుగు, కన్నడంలో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించే చాన్స్‌ను కొట్టేసింది. సిండ్రిల్లా అనే ఫాంటసీ, హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. చిన్నారుల కలల ప్రపంచంలో కనిపించే దేవకన్య లాంటి పాత్ర సిండ్రిల్లా. ఈ పేరుతో ఒక చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు ఎస్జే.సూర్య శిష్యుడు వినో వెంకటేశ్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పడుతున్నారు. ఎస్ఎస్ఐ. ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు 100 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న తొలి చిత్రం సిండ్రిల్లా. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు హర్రర్ ఇతివృత్తంగా పలు చిత్రాలు వచ్చినా, వాటికి పూర్తి భిన్నంగా సిండ్రిల్లా చిత్రం ఉంటుందని అన్నారు. చిత్ర టైటిల్ వినగానే నిర్మాత చిత్రం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నటి లక్ష్మీరాయ్‌కు పంపామని, ఆ తరువాత ఒక షూటింగ్లో ఉన్న ఆమెను లంచ్ బ్రేక్‌లో కలిసి కథను వినిపించామని చెప్పారు. అంతకు ముందే పంపిన సింగిల్‌లైన్ కథను చదివిన రాయ్‌లక్ష్మి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని, చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు వినో వెంకటేశ్ తెలిపారు. -
ఈ ప్రశ్నలేంటిరా బాబూ!
అస్తమానం అడిగిందే అడిగుతుంటే మొదట బోర్ కొడుతుంది. ఆపై ఆ అడిగినవారినీ ఏదో చేయాలన్నంత కోపం వస్తుంది. కామన్ మ్యానే కాదు... నలుగురిలో తిరిగే సెలబ్రిటీలకైనా ఈ టెంపర్మెంట్లో పెద్దగా తేడా ఉండదని చూపించింది హాలీవుడ్ హాట్ బ్యూటీ లిలీ జేమ్స్. వాల్డ్ డిస్నీ పిక్చర్స్ ‘సిండెరెల్లా’లో నటించిన ఈ స్వీటీ ఒంపుసొంపులపై ఇప్పటికే విపరీతమైన చర్చలు నడిచాయి. ప్రత్యేకించి ఈ చిన్నదాని చిట్టి నడుముపై ఎందరో మనసు పారేసుకున్నారు కూడా. రీసెంట్గా ‘సిండెరెల్లా’ ప్రమోషన్ టూర్‌కు వెళ్లిన ఈ బ్రిటీష్ బ్యూటీకి మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది... మీ సూపర్ ఫిగర్ సీక్రెట్ ఏంటని! దెబ్బకు చిర్రెత్తిన అమ్మడు... ‘నా బాడీపై ఇక ప్రశ్నలు ఆపండి. వినివిని అలసిపోయా. మహిళలను ఎప్పుడూ అదే దృష్టితో చూస్తారెందుకు’ అంటూ ఫైరైపోయింది సదరు ఔత్సాహికులపై! -
హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ : నబాబుగారు పార్టీనుంచి ఇంటిలోకి అడుగు పెట్టారు! స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీలకోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేలా రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది! నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట! నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా! అలా సాగనంపాను! నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను! ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి