భయపెట్టే సిండ్రెల్లా | Laxmi Rai look release from Cinderella | Sakshi
Sakshi News home page

భయపెట్టే సిండ్రెల్లా

Published Thu, May 7 2020 4:53 AM | Last Updated on Thu, May 7 2020 4:53 AM

Laxmi Rai look release from Cinderella - Sakshi

లక్ష్మీ రాయ్‌

లక్ష్మీ రాయ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సిండ్రెల్లా’. ఈ  సినిమాలో ఆమె మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మంగళవారం లక్ష్మీ రాయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ లుక్‌ ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేస్తున్న మూడు పాత్రల్లో తులసి పాత్ర ఒకటి. ఆ పాత్రకు సంబంధించిన లుక్‌ నే విడుదల చేశారు. వినూ వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యాంటసీ, హారర్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోంది. ‘‘సిండ్రెల్లా, తులసి, రాక్‌ స్టార్‌ గా ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాను. ఎవ్వరూ  ఊహించని విధంగా ఈ స్క్రిప్ట్‌ ఉంటుంది’’ అన్నారు లక్ష్మీ రాయ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement