సాగరతీరంలో ఖైదీ విజయోత్సవం..? | Khaidi Number 150 Success Celebrations in Vizag | Sakshi
Sakshi News home page

సాగరతీరంలో ఖైదీ విజయోత్సవం..?

Published Thu, Jan 19 2017 1:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

సాగరతీరంలో ఖైదీ విజయోత్సవం..?

సాగరతీరంలో ఖైదీ విజయోత్సవం..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతీష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ, రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్లను సృష్టిస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోలను సవాల్ చేస్తూ చిరంజీవి వందకోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఖైదీ నంబర్ 150 టీం.

అందుకే భారీ విజయోత్సవ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకను హైదరాబాద్ లేదా.. విశాఖలలో నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో మెగా హీరోల సక్సెస్మీట్లను విశాఖలో నిర్వహించిన నేపథ్యంలో ఖైదీ విషయంలో కూడా అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.  ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ఉత్తరాంద్రలో 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో అక్కడే విజయోత్సవాన్ని నిర్వహిస్తే 10 కోట్ల మార్క్ చేరుకోవచ్చని కూడా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement