వైజాగ్‌ టు హైదరాబాద్‌ | Shooting ends for Chiranjeevi, Ravi Teja action entertainer At Vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ టు హైదరాబాద్‌

Published Mon, Oct 3 2022 12:47 AM | Last Updated on Mon, Oct 3 2022 12:47 AM

Shooting ends for Chiranjeevi, Ravi Teja action entertainer At Vizag - Sakshi

చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటీవల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ వైజాగ్‌లో మొదలైంది.

ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, రవితేజలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షెడ్యూల్‌లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రవితేజ తిరిగి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారని టాక్‌. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్‌’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిరంజీవి. కాగా ‘వాల్తేరు వీరయ్య’ కొత్త షెడ్యూల్‌ అతి త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్‌ ఎం, లైన్‌ ప్రొడ్యూసర్‌: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement