మెగా అభిమానులకు మరో షాక్ | No audio Function for Khaidi No 150 | Sakshi
Sakshi News home page

మెగా అభిమానులకు మరో షాక్

Published Sat, Dec 17 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

మెగా అభిమానులకు మరో షాక్

మెగా అభిమానులకు మరో షాక్

దాదాపు దశాబ్ద కాలంగా మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ రోజు దగ్గరకొచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సందడి మొదలైపోగా, ఆడియో వేడుక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ గత చిత్రాలు సరైనోడు, ధృవ మాదిరిగానే ఖైదీ నంబర్ 150కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది.

అభిమానుల కోసం ఈ నెల 18న 'అమ్మడు లెట్స్ డు కుమ్మడు' అనే సాంగ్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 25న ఆడియోను డైరెక్ట్గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి.. తరువాత సినిమా రిలీజ్కు ముందు ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా. సెంటిమెంట్ పరంగా కూడా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసే అవకాశాలే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement