
బ్లాక్ అండ్ వైట్ చందమామ
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న అందాలభామ కాజల్ అగర్వాల్.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న అందాలభామ కాజల్ అగర్వాల్. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటి, తరువాత అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల వరుసగా ఆఫర్లు వస్తున్నా.., సక్సెస్ మాత్రం రావటం లేదు. దీంతో అభిమానులను అలరించేందుకు ఫోటోషూట్లతో సందడి చేస్తోంది.
తాజాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో షూట్ చేసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఈ చందమామ, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ టెడ్ గ్రాంట్ చేసిన కామెంట్ను ఫోటోతో పాటు పోస్ట్ చేసింది. 'నువ్వు ఎప్పుడైనా ఓ మనిషిని కలర్లో ఫోటో తీస్తే, అందులో అతని దుస్తులు మాత్రమే కనిపిస్తాయి. అదే నువ్వు ఓ వ్యక్తిని బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తే, అందులో అతని ఆత్మ కనిపిస్తుంది' అనే టెడ్ గ్రాంట్ కామెంట్ను పోస్ట్ చేసింది.
"Wen u photograph ppl in color, u photograph their clothes. But when u photograph ppl in Black & white, u photograph their souls" -Ted Grant pic.twitter.com/mEcBtv314B
— Kajal Aggarwal (@MsKajalAggarwal) 10 December 2016