కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్‌ 150 పాట | 2 Million views for khaidi number 150 song in 24hrs | Sakshi
Sakshi News home page

కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్‌ 150 పాట

Published Mon, Dec 19 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్‌ 150 పాట

కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్‌ 150 పాట

తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్‌ 150 సినిమాలోని పాట ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు అనే సాంగ్‌ టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్‌ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షిస్తున్నారు. ఈ పాటను రిలీజ్‌ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్‌కు ఇన్ని లక్షల వ్యూస్‌ రావడం అరుదని లహరి మ్యూజిక్‌ ట్వీట్‌ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ రీ ట్వీట్‌ చేశాడు. ఈ పాటను వీక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ దేవిశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు.

ఆడియో సాంగ్‌తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి రెడ్‌ షర్టు వేసుకుని, ఫ్యాంటుపై లుంగీ కట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని మాస్‌ లుక్‌లో యంగ్‌గా కనిపించాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement