సంక్రాంతి రేసులో మరో హీరో | Another film to join in Pongal race | Sakshi
Sakshi News home page

సంక్రాంతి రేసులో మరో హీరో

Published Sat, Dec 31 2016 2:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

సంక్రాంతి రేసులో మరో హీరో

సంక్రాంతి రేసులో మరో హీరో

గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ వెండితెర మీద సంక్రాంతి పోటి భారీగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు ముఖాముఖి

గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ వెండితెర మీద సంక్రాంతి పోటి భారీగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు ముఖాముఖి తలపడుతుండగా యంగ్ హీరో శర్వానంద్ కూడా బరిలో దిగుతున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శతమానంభవతి దిల్రాజు నిర్మాణంలో తెరకెక్కుతుండటంతో థియేటర్ల సమస్య ఉండే అవకాశం లేదు.

అయితే ఇంత భారీ పోటిలోకి ఓ చిన్న సినిమా అడుగుపెడుతోంది. విప్లవ సినిమాలతో పీపుల్స్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఆర్ నారాయణమూర్తి.. హెడ్ కానిస్టేబుల్ వెంట్రామయ్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి జయసుధ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి లాంటి సినిమాలు రిలీజ్ అవుతుండగా ఆర్ నారాయణమూర్తికి థియేటర్లు దొరికే ఛాన్స్ కనిపించటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆర్ నారాయణమూర్తి రిస్క్ చేసి తన సినిమా రిలీజ్ చేస్తాడా..? లేక కొద్ది రోజులు వాయిదా వేస్తాడా..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement