
ఖైదీ కోసం రానా, నవదీప్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సింగిల్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తోంది మెగా టీం.
విజయవాడ వేదికగా జరగనున్న ఈ ఈవెంట్కు యువ నటులు రానా, నవదీప్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారట. ఇప్పటికే పలు సినీ వేడుకలకు యాంకరింగ్ చేసిన నవదీప్, తన సినిమాల ఆడియో వేడుకల్లో యాంకరింగ్ చేసే రానా.. ఇద్దరు కలిసి మెగాస్టార్ రీ ఎంట్రీకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ వేడుకలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, లైవ్ పర్ఫామెన్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.