అన్నయ్య సినిమా చూసిన పవన్ | Pawan Kalyan Watches Chiranjeevi Khaidi Number 150 | Sakshi
Sakshi News home page

అన్నయ్య సినిమా చూసిన పవన్

Published Fri, Jan 13 2017 10:28 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అన్నయ్య సినిమా చూసిన పవన్ - Sakshi

అన్నయ్య సినిమా చూసిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఖైదీ నంబర్ 150 చూశాడన్న టాక్ అభిమానులకు మరింత కిక్ ఇస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అవ్వటంతో పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ఖైదీ నంబర్ 150 స్పెషల్ షో చూశాడన్న వార్త విని మరింత ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్కు ముందు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు కాకపోవటం అనుమాలకు దారితీసింది. పవన్ పెద్దగా వేడుకలకు రావడానికి ఇష్టపడడని చిరు చెప్పిన అభిమానులు సంతృప్తి చెందలేదు. అయితే ఇప్పుడు ఖైదీ నిర్మాత రామ్ చరణ్ ఏర్పాటు చేసిన స్పెషల్ షోను పవన్ చూశాడని తెలియంటంతో ఫుల్ జోష్లో ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150, ఈ బుధవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తొలి రోజు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మెగాస్టార్, పదేళ్ల విరామం తరువాత వచ్చినా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ కోసం హీరోలు ఎన్నో కష్టాలు పడుతుంటే మెగాస్టార్ ప్రీమియర్ షోలతోనే అన్ని రికార్డ్లను చెరిపేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement