బాహుబలి రికార్డ్ను చెరిపేసిన ఖైదీ | Khaidi Number 150 First Day Collection Record | Sakshi
Sakshi News home page

బాహుబలి రికార్డ్ను చెరిపేసిన ఖైదీ

Published Thu, Jan 12 2017 2:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

బాహుబలి రికార్డ్ను చెరిపేసిన ఖైదీ

బాహుబలి రికార్డ్ను చెరిపేసిన ఖైదీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150. చిరు తొమ్మిదిన్నరేళ్ల విరామం తరువాత మెగాస్టార్ హీరోగా నటించిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిరంజీవి కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. గతంలో రికార్డులు సాధించిన ప్రతీ తెలుగు సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకునేది. కానీ ఖైదీ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ కూడా చెరిగిపోయాయంటున్నారు ఫ్యాన్స్.

తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డ్ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిన ఖైదీ నంబర్ 150 ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. తొమ్మిదేళ్ల విరామం తరువాత కూడా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement