మెగా మూవీలో తమన్నా..? | Tamanna Special Song in Khaidi number 150 | Sakshi
Sakshi News home page

మెగా మూవీలో తమన్నా..?

Published Tue, Aug 30 2016 11:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

మెగా మూవీలో తమన్నా..?

మెగా మూవీలో తమన్నా..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 ని సక్సెస్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ కాస్టింగ్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు తాజాగా మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాను హీరోయిన్గా కాజల్ అగర్వాల్నే ఫైనల్ చేసిన యూనిట్, ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.

కత్తి సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఒరిజినల్ వర్షన్లో స్పెషల్ సాంగ్ లేకపోయినా.. అభిమానులు చిరు నుంచి ఆశించే మాస్ డ్యాన్స్ల కోసం ప్రత్యేకంగా ఈ సాంగ్ ను రూపొందిస్తున్నారు. గతంలో చాలా సందర్భాంలో తమన్నా కలిసి నటించాలన్న ఆసక్తి కనబరిచిన చిరు తన రీ ఎంట్రీ సినిమాలోనే ఆ కోరిక కూడా తీర్చేసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement