చిరు 150 రిలీజ్ పై డైలమా.? | Khaidi number 150 Release Date Dilemma | Sakshi
Sakshi News home page

చిరు 150 రిలీజ్ పై డైలమా.?

Published Fri, Nov 4 2016 8:54 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

చిరు 150 రిలీజ్ పై డైలమా.? - Sakshi

చిరు 150 రిలీజ్ పై డైలమా.?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్పై టాలీవుడ్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ మెగా మూవీని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలోనే వచ్చింది అసలు సమస్య. అదే రోజు మరో సీనియర్ స్టార్ హీరో కూడా బరిలో దిగుతుండటంతో మెగా మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట.

అదే రోజు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అవుతోంది. బాలయ్య వందో చిత్రం కావటంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మెగా మూవీ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా జరిగిపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా రిలీజ్ డేట్ విషయంలో వత్తిడి ఉందన్న టాక్ వినిపిస్తోంది. అనుకున్న డేట్ కన్నా ఒక్క రోజు ముందే రిలీజ్ చేస్తే రికార్డ్ కలెక్షన్లు సాధించటంతో పాటు సేఫ్ జోన్ లోకి వెళ్లోచ్చని భావిస్తున్నారు.మరి ఈ ఒత్తిళ్లతో మెగా కాంపౌండ్ రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement