ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్ | Catherine to romance Arya in his next | Sakshi
Sakshi News home page

ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

Published Sun, Feb 28 2016 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

క్యాథరిన్‌ట్రెసా ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళా కుట్టి తమిళ చిత్ర పరిశ్రమలో తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇక్కడ మెడ్రాస్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలెట్టిన క్యాథరిన్‌ట్రెసా ఆ చిత్ర విజయం బాగానే హెల్ప్ అయ్యింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకోవడంతో క్మాథరిన్ ట్రెసాకి కోలీవుడ్‌లో గిరాకీ పెరిగిందనే చెప్పాలి. అధర్వతో జతకట్టిన కణిదన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు క్యాథరిన్ అందాలు చిత్రానికి ఆకర్షణ అయ్యాయి.
 
 తాజాగా హీరోయిన్ల హీరోగా ప్రచారంలో ఉన్న నటుడు ఆర్యతో డ్యూయెట్లు పాడడానికి ఈ మలయాళీ బ్యూటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ.చౌదరి ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య హీరోగా నటించనున్నారు.
 
  ఆయనకు జంట గా నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇంతకు ముందు మంజాపై వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు క్యాథరిన్ ట్రెసా ఇప్పటికే వీర ధీర శూరన్, ముత్తురామలింగన్ చిత్రాలతో పాటు తెలుగులో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉందని కోలీవుడ్ టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement