
తమిళసినిమా: కోలీవుడ్‌లో మెడ్రాస్ చిత్రంతో మెరిసిన భామ క్యాథరిన్ ట్రెసా. ఆ చిత్రంలో నెక్స్ట్ డోర్ గర్ల్‌గా కనిపించినా, ఆ తరువాత గ్లామరస్ పాత్రల్లో విజృంభించిందనే చెప్పాలి. ఇటీవల సుందర్.సి తెరకెక్కించిన కలగలప్పు–2 చిత్రంలో కూడా కావలసినంత గ్లామర్‌ను ప్రేక్షకులకు పంచేసింది. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ తన అందాలతో అలరించేస్తోంది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంతో గుర్తింపు పొందింది. ఐటమ్ సాంగ్స్‌కు నో చెప్పని ఈ బ్యూటీ తన మనసులోని భావాలను ఇలా పంచుకుంది. తమిళంలో నాకు మంచి కథా పాత్రలు లభిçస్తున్నాయి. చిత్రం చిత్రంకు వైవిధ్యం చూపే అవకాశం లభిస్తోంది. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించినా, అందుకు సిగ్గు పడడం లేదు.
నిజం చెప్పాలంటే గర్వపడుతున్నాను. పాత్రకు ఏం అవసరమో అది చేస్తున్నాను. ఇక్కడ మంచి అవకాశాలు రావడంతో తానిప్పుడు తమిళ భాషను నేర్చుకుంటున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచే నాట్యాన్ని నేర్చుకున్నాను. అదిప్పుడు చిత్రాల్లో నటించడానికి చాలా ఉపకరిస్తోంది. నేను డాన్స్ బాగా చేస్తానని చాలా మంది అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రేమ,పెళ్లి గురించి అడుగుతున్నారు. తొలిచూపులోనే ప్రేమ పుట్డడంపై నాకు నమ్మకం లేదు. ఒకరిని చూడగానే జీవితాంతం కలిసుండాలన్న భావన కలగాలి. అతను మనకు తోడుగా ఉంటాడన్న నమ్మకం కలగాలి. అలాంటిదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ చివరి వరకూ నిలిచిపోతుంది. జీవితాన్ని మధురంగా మారుస్తుంది. చూడగానే కలిగే ప్రేమ అంత వేగంగా పోతుంది. ఇకపోతే నేనిప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదు. నాకైతే చాలా మంది ప్రేమిస్తున్నట్లు చెప్పారు.అలాంటి వారిని ప్రేమిస్తున్నారా? సరే. థ్యాంక్స్ అని చెబుతానే కానీ ప్రోత్సహించను. ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నాను. మరో ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది అని క్యాథరిన్ ట్రెసా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment