పోలీస్‌ స్టేషన్‌లో... | Catherine Tresa, Sandeep Madhav action thriller | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో...

Aug 12 2023 5:59 AM | Updated on Aug 12 2023 5:59 AM

Catherine Tresa, Sandeep Madhav action thriller - Sakshi

హీరోయిన్‌ కేథరిన్‌ ట్రెసా పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారు. ఆమె పోలీసాఫీసర్‌ కాదు.. ఖైదీ కూడా కాదు. మరి.. పోలీస్‌ స్టేషన్‌కి ఎందుకు వెళ్లారంటే.. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా. కేథరిన్‌ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి, వంగవీటి’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సందీప్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. కేథరిన్‌ క్యారెక్టర్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆమె పాత్రను డిజైన్‌ చేశారట చిత్రదర్శకుడు అశోక్‌ తేజ.

ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో సందీప్, కేథరిన్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని కేసీఆర్‌ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్‌ బ్యానర్‌లపై దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. ‘‘స్క్రీన్‌ప్లే బేస్డ్‌æ చిత్రమిది. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం కొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమాలో ఎవరూ ఊహించని మలుపులు ఉంటాయి. ప్రతి సీన్‌ ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement