నిఖిల్‌కు జోడిగా కేథరిన్‌ | Catherine opposite Nikhil Siddhartha in Kanithan Remake | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 3:31 PM | Last Updated on Thu, Feb 1 2018 3:31 PM

 Nikhil Siddhartha Catherine Tresa - Sakshi

నిఖిల్‌, కేథరిన్

విభిన్న చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, ఇప్పుడు రీమేక్‌ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కన్నడ సూపర్‌ హిట్ కిరిక్‌ పార్టీకి రీమేక్‌ గా తెరకెక్కుతున్న కిరాక్‌ పార్టీ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్‌. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమాలోనే నటించనున్నాడు నిఖిల్. తమిళనాట సంచలన విజయం సాధించిన కనితన్‌ సినిమా  తెలుగు రీమేక్‌ లో నటించనున్నాడు.

కోలీవుడ్ అధర్వ నటించిన పాత్రలో నిఖిల్ అలరించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కేథరిన్‌ థ్రెసా హీరోయిన్‌ గా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement