చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది! | Catherine Tresa will appear special song in Chiranjeevi movie | Sakshi
Sakshi News home page

చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది!

Published Tue, Sep 6 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది!

చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది!

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్ పై ఎంతో కసరత్తు జరిగింది. కత్తిలాంటోడు అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా.. చివర్లో 'ఖైదీ నెం.150'కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి 'చందమామ' కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ దక్షిణాది హీరోయిన్ కేథరిన్ ట్రెసాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పేసింది. చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్నిఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది.

మెగాస్టార్ మూవీ అనగానే దాదాపు మూడు నెలల కిందటే కేథరిన్ ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందట. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ వారు వెల్లడించారు. అయితే ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. తమిళ మూవీ ఒరిజినల్ 'కత్తి' లో ఈ పాట లేదని సమాచారం. తమిళ కత్తి రీమేక్ అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ కోసం మూవీ యూనిట్ చిన్న చిన్న మార్పులు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిరు, కేథరిన్ లపై సాంగ్స్ చిత్రీకరణ జరగనుందన్న వార్త ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్. చిరుకు ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement