
మరోసారి టాప్ లేచిపోద్ది!
‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో అల్లు అర్జున్, అమలాపాల్ ల ప్రేమకథను అన్వేషించే పాత్రలో కనిపించిన కేథరిన్ గుర్తున్నారా? అదేనండీ.. అల్లు అర్జున్‌తో కలిసి ‘టాప్ లేచిపోద్ది’ అంటూ దుమ్ము రేపిన ఈ భామ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సరసన నటించనున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే ఈ చిత్రంలో ఈ భామ రెండో కథానాయికగా ఎంపిక అయ్యారట. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన నాయిక. హీరోలను తన దైన శైలిలో చాలా శక్తిమంతంగా చూపించే బోయపాటి శ్రీను ఈ చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.