వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట | I always try to do good films: Karthi | Sakshi
Sakshi News home page

వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట

Published Wed, Oct 1 2014 12:05 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట

వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట

వరుసపెట్టి ఫ్లాపులు దండెత్తిన చాలా కాలం తర్వాత ఓ సినిమా మంచి హిట్ కావడంతో తమిళ హీరో కార్తీ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అతడు తాజాగా నటించిన తమిళ చిత్రం 'మద్రాస్'ను ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. దాంతో ఇన్నాళ్లకు కార్తీ కొంచెం ఊరటగా కనిపిస్తున్నాడు. తాను ప్రతిసారీ మంచి సినిమాలే చేయాలనుకుంటాను గానీ, కొన్ని సార్లు అవి ఎందుకు ఫెయిలవుతాయో తెలియదన్నాడు.

మద్రాస్ చిత్రం విడుదలైనప్పటి నుంచి తనకు అన్ని వర్గాల వాళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నాడు. రజనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ త్రెసా నటించింది. వాస్తవానికి కేథరిన్ తెలుగులో చాలా సినిమాల్లో చేసినా ఇక్కడ మాత్రం ఆమెకు సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. రెండు మైనస్లు కలిస్తే ఒక ప్లస్ అయినట్లు.. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కార్తీ, కేథరిన్ కలిసి నటించేసరికి అది కాస్తా మంచి హిట్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement