చెన్నై : అవును ఒత్తిడి చేస్తున్నారు అని అంటోంది హీరోయిన క్యాథరిన్ ట్రెసా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు మార్కెట్ పెద్దగా లేదు. చేతిలో ఒక్క చిత్రం కూడా కనిపించడం లేదు. గ్లామర్‌కు కేరాఫ్ క్యాథరిన్ ట్రెసా అనడంలో అతిశయోక్తి ఉండదు. మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన దుబాయి బ్యూటీ ఈ అమ్మడు. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి ఆ తరువాత నటిగా రంగప్రవేశం చేసింది. మెడ్రాస్ చిత్రంలో కార్తీకు జంటగా దర్శకుడు పా.రంజిత్ పక్కింటి అమ్మాయిగా చూపించారు. అయితే అలా ఆ చిత్రం వరకే పరిమితమైంది క్యాథరిన్ ట్రెసా. ఆ తరువాత అందాలారబోతలో మోత మోగించింది. దీంతో తెలుగు, కన్నడం, మలయాళం సినీ దర్శక నిర్మాతల దృష్టిలోనూ పడింది. అలా నాలుగు భాషల్లో నటిస్తూ కెరీర్‌ను 10 ఏళ్లు లాగించేసింది. ప్రస్తుతం అవకాశాలు అమ్మడి దరి చేరడం లేదు. తమిళంలో క్యాథరిన్ ట్రెసా నటించిన చివరి చిత్రం వందా రాజావాదాన్ వరువేన్.
కాగా ఈ బ్యూటీ నటించిన చిత్రాల విజయాల శాతం తక్కువనే చెప్పాలి. తనకు అవకాశాలు అడుగంటడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. దీంతో తనను తాను ప్రచారం చేసుకునే పనిలో పడిందనిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఎక్కువగా ఇద్దరు హీరోయిన్ల చిత్రాల్లోనే నటించినట్లున్నారు అన్న ప్రశ్నకు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. హిందీలో ఇద్దరు కంటే ఎక్కువ హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తున్నారని, అలాంటిది దక్షిణాది చిత్రాల్లో నటించడంలో తప్పేంటని ప్రశ్నించింది. ఎందరితో కలిసి నటించినా వారి కుండే ప్రత్యేకత తగ్గదు అని చెప్పింది. సరే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం మాటేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇదే ప్రశ్న చాలా మంది వేస్తున్నారని వరుడు లభిస్తే తాను పెళ్లికి రెడీ అని చెప్పింది. సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని అంది. అయితే పెళ్లి కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తనకు నచ్చదని చెప్పింది. తన ఇంట్లో త్వరగా పెళ్లి చేసుకోమనే ఒత్తిడి ఉన్న మాట నిజమేనంది. అదేవిధంగా ప్రేమంటే ద్వేషం లాంటిఏవీ లేవని, అయితే ఇప్పటి వరకూ ప్రేమించదగ్గ వ్యక్తి తన జీవితంలో ఇంకా తారసపడలేదని చెప్పింది. ప్రేమ అన్నది మనసుకు సంబంధించిందని, దాన్ని వివరించడం కష్టం అనీ చెప్పింది. అదే విధంగా తాను ప్రేమ వివాహం చేసుకుంటానా, పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటానా అన్నది ఇప్పుడు చెప్పలేనని నటి క్యాథరిన్ ట్రెసా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment