ఆయన కోసమే అలా నటించా! | Catherine Tresa special songs in boyapati movie | Sakshi
Sakshi News home page

ఆయన కోసమే అలా నటించా!

Jul 5 2017 1:00 AM | Updated on Sep 5 2017 3:12 PM

ఆయన కోసమే అలా నటించా!

ఆయన కోసమే అలా నటించా!

సైరైన పాత్రనిచ్చారని..ఈ ఒక్కసారికి కానిచ్చేస్తున్నా. ఇకపై అలా నటించను అంటోంది నటి క్యాథరిన్‌ట్రెసా.

తమిళసినిమా: సైరైన పాత్రనిచ్చారని..ఈ ఒక్కసారికి కానిచ్చేస్తున్నా. ఇకపై అలా నటించను అంటోంది నటి క్యాథరిన్‌ట్రెసా. విషయం ఏమిటంటే ఈ ముద్దుగుమ్మ ఎంతగా అందాలారబోసినా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్‌లో అందాలను ఆరబోసినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇటీవల సరైనోడు చిత్రంలోనూ రెండవ నాయకి పాత్రతోనే సరిపెట్టుకుంది. తాజాగా ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శీను తాజా చిత్రంలో ఐటమ్‌గర్ల్‌గా మారిపోయింది. ఇందుకు భారీ పారితోషికమే(రూ.60 లక్షలు) పుచ్చుకుందంటున్నారు సినిమా వర్గాలు.

అదేమంటే బోయపాటి కోసమే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను అని సాకు చెబుతోంది.ఆయన సరైనోడు చిత్రంలో తనకు అవకాశం ఇచ్చారని,అందుకే ఆయన కోరిక మేరకు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న జై జానకి నాయక చిత్రంలో సింగిల్‌ సాంగ్‌కు అంగీకరించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై ఐటమ్‌ సాంగ్‌కు ఆడేది లేదని అంటోంది. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇటీవల ఆర్యతో నటించిన కడంబన్‌చిత్ర పరాజయం ఎఫెక్ట్‌ కావచ్చు. విష్ణువిశాల్‌తో నటించిన కథానాయకన్‌ చిత్రం విడుదల కావలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement